: విజయవాడ కానూరులో ఉద్రిక్తత... పోలీసుల మోహరింపు
కృష్ణా జిల్లా విజయవాడలోని కానూరులో ఉద్రిక్తత నెలకొంది. కానూరులో చక్రవర్తి అనే వ్యక్తి ఓ బార్ ను ప్రారంభించాడు. అయితే, బార్ ప్రారంభోత్సవ సమయానికి పలువురు మహిళలు అక్కడికి చేరుకుని, బార్ మూసేయాలంటూ ఆందోళన చేపట్టారు. దీంతో చక్రవర్తి వారితో వాగ్వాదానికి దిగాడు. తన స్థలంలో బార్ ఏర్పాటు చేసుకుంటే అడ్డుకోవడానికి మీరెవరని ఆయన వారిని నిలదీశాడు. మహిళలు మరింత ఆగ్రహం వ్యక్తం చేయడంతో... ఇప్పటికే అదే ఏరియాలో ఉన్న కృషి బార్ ను మూసేయిస్తే తాను కూడా బార్ మూసేస్తానని చక్రవర్తి స్పష్టం చేశాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.