: ముందస్తు ఫలితాలు చెప్పిన సహకార ఎన్నికలు : చిరంజీవి
2014 సాధారణ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో సహకార ఎన్నికలు నిరూపించాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అన్నారు. ఢిల్లీలో ఉన్నపీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణతో భేటీ అయిన ఆయన అనంతరం, విలేకరులతో మాట్లాడారు. సహకార ఎన్నికల ఫలితాలు, రాష్ట్ర పరిస్థితులపై బొత్సతో చర్చించానని చిరంజీవి తెలిపారు.