: తన సోదరుడి ‘సంగీత్’ వేడుకలో డాన్సులతో అలరించిన హీరోయిన్ తమన్నా!


హీరోయిన్ తమన్నా తన సోదరుడు ఆనంద భాటియా పెళ్లి వేడుకలో భాగంగా నిర్వహించిన సంగీత్ లో సంప్రదాయ దుస్తుల్లో కనిపించి, అలరించింది. వేదికపై డ్యాన్స్ చేస్తూ ఉత్సాహంగా క‌నిపించింది. రంగురంగుల దుస్తులు ధ‌రించి ఆమె డ్యాన్స్ వేసిన ప‌లు ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. సంగీత్ వేడుక‌కు హాజ‌ర‌వుతున్న వారికి ఆహ్వానం పలికింది. చేతి నిండా గోరింటాకు పెట్టుకుని ముురిసిపోయింది. సినిమాల్లో బిజీబిజీగా ఉంటూనే ఇలా త‌న సోద‌రుడి సంగీత్ వేడుక‌లోనూ ఎంతో ఉత్సాహంగా క‌నిపించింది. హీరోయిన్ తమన్నా తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో న‌టించి మంచిపేరు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే.  

  • Loading...

More Telugu News