: జీఎస్టీ ప్రభావం: పాల ఉత్పత్తుల ధరలను తగ్గించిన హెరిటేజ్
దేశ వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఒకే పన్ను ఒకే విధానం ప్రారంభమైన విషయం తెలిసిందే. జీఎస్టీ అమలు నేపథ్యంలో పలు వస్తువులు, సరుకుల రేట్లు పెరుగగా మరికొన్నింటి రేట్లు తగ్గాయి. ప్రజలు ఎక్కువగా ఉపయోగించే పాల ఉత్పత్తులపై పన్ను తగ్గడంతో ఆ ఉత్పత్తుల ధరలు తగ్గాయి. వీటిపై పన్ను భారం 14.5 నుంచి 12 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రముఖ పాల ఉత్పత్తుల కంపెనీ హెరిటేజ్ ఓ ప్రకటన చేసింది. దూద్ పేడ, మిల్క్ కేక్ కేజీ ధరను రూ.30 మేరకు తగ్గించినట్లు పేర్కొంది. ఇరు రాష్ట్రాల్లో వెన్న, నెయ్యి ధరలను కూడా తగ్గిస్తున్నట్లు చెప్పింది. మరోవైపు ఐస్క్రీమ్, ఫోజెన్ డిస్టర్లపై పెరిగిన పన్ను భారాన్ని కూడా తమ కంపెనీయే భరిస్తుందని పేర్కొంది.