: ఆజంఖాన్ నాలుక తెస్తే 50 లక్షలు: వీహెచ్పీ ప్రకటన
ఈ మధ్య కాలంలో తమకు వ్యతిరేకంగా మాట్లాడినవారిని తీవ్ర పదజాలంతో హెచ్చరించడం నుంచి, అలాంటి వారి తలకు, ఇతర అవయవాలకు వెలకట్టే సంస్కృతి వరకు వివాదం పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజంఖాన్ నాలుక కోసి తెస్తే 50 లక్షల రూపాయల రివార్డు ఇస్తామని విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది. అసోం, కశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో భద్రతా సిబ్బంది ఆగడాలు అధికమయ్యాయని, మహిళలపై అకృత్యాలు చేసేవారిని ఉపేక్షించవద్దని, వారి మర్మావయవాలు కోసేయాలని ఆయన పిలుపునిచ్చారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయనపై దేశద్రోహం కేసు కూడా నమోదైంది. మరోవైపు ఆయన నాలుక కోసి, తెచ్చినవారికి రివార్డు ఇస్తామని విహెచ్పీ ప్రకటించడం వివాదాస్పదమవుతోంది.