: ఏపీ, తెలంగాణల్లోని చెక్ పోస్టులు బంద్!
ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న చెక్ పోస్టులన్నీ మూతపడ్డాయి. గత అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమల్లోకి రావడంతో, ఇకపై వీటీ అవసరం లేకుండా పోయింది. 29 ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం చెక్ పోస్టు సరిగ్గా రాత్రి 12 గంటలకు మూతపడింది. ఏపీ వ్యాప్తంగా మొత్తం 21 చెక్ పోస్టులు మూతపడ్డాయి. చెక్ పోస్టులు మూతపడినప్పటికీ... అనుమానం వచ్చిన వాహనాలను మాత్రం అధికారులు రోడ్ల మీద ఎక్కడైనా తనిఖీలు చేస్తారు.