: ఎయిర్‌టెల్ నుంచి మరో ఆఫర్.. డోంగిల్ యూజర్లకు రూ.499కే 35 జీబీ 4జీ డేటా!


దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ ఈసారి డోంగిల్ యూజర్ల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.499కే 35 జీబీ 4జీ డేటాను అందిస్తున్నట్టు ప్రకటించింది. దీని కాలపరిమితి నెల రోజులు. కాగా, గతంలో రూ.3 వేలు ఉన్న ఎయిర్‌టెల్ డోంగిల్‌‌ను ప్రస్తుతం రూ.1500కే అందిస్తున్నట్టు తెలిపింది. అయితే ఇది ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసిన వారికి మాత్రమేనని పేర్కొంది. కాగా, ఎయిర్‌టెల్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను ఇటీవల సంస్థ మరో మూడు నెలలు పొడిగించిన సంగతి తెలిసిందే. దీంతో పోస్ట్ పెయిడ్ యూజర్లకు మరో మూడు నెలలపాటు నెలకు 10 జీబీ చొప్పున ఉచిత డేటా లభిస్తుంది.

  • Loading...

More Telugu News