: ఆధార్ తో మీ పాన్ కార్డు అనుసంధానం కాలేదా?... మరేం పర్లేదు!


ఆధార్ తో అనుసంధానం చేసుకోకపోతే, జూలై 1 నుంచి మీ పాన్ కార్డు నిరుపయోగం అవుతుందంటూ విస్తృత ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. జూలై 1 వచ్చేసింది. ఇంకా అనుసంధానం చేసుకోలేదు ఎలా? అని ఆందోళన చెందకండి. ఎందుకంటే మీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు లేదా కొత్త పాన్ కార్డుకు దరఖాస్తు చేసినప్పుడు తప్పనిసరిగా ఆధార్ తో అనుసంధానం చేసుకోండి అంటూ ఆదాయపుపన్ను శాఖ సూచించింది. పేర్లలో తేడాలు, అక్షరదోషాలు, ముందు పేరు, తరువాత ఇంటి పేరు ఇలాంటి కారణాలతో పలువురి ఆధార్, పాన్ కార్డుల అనుసంధానం జరగలేదు.

అంతే కాకుండా అన్నీ బాగున్నా చివరిరోజైన శుక్రవారం యూఐడీఏఐ వెబ్ సైట్ స్తంభించిపోయింది. ఆ కారణంగా వినియోగదారుల ఆధార్, పాన్ అనుసంధానం జరగలేదు. దీంతో దిగివచ్చిన ఆదాయపుపన్ను శాఖ తాజాగా ప్రకటన జారీ చేసింది. ఇప్పటికిప్పుడు అనుసంధానం కాకపోయినా ఫర్వాలేదు కానీ, త్వరగా అనుసంధానం చేసుకోవాలని సూచించింది.

  • Loading...

More Telugu News