: టీమిండియా మాజీ కెప్టెన్ తో కలిసి స్టెప్పులేసిన సినీ నటి శ్రీదేవి
తన సెకండ్ ఇన్నింగ్స్ లో 'ఇంగ్లిష్ వింగ్లీష్' తర్వాత ప్రముఖ నటి శ్రీదేవి తాజాగా నటించిన ‘మామ్’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆమె బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో శ్రీదేవి కోల్‌కతా వెళ్లింది. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నిర్వహిస్తున్న‘దాదాగిరి’ టీవీ ప్రోగ్రామ్ లో ఆమె నిన్న పాల్గొంది. ఈ సందర్భంగా తన చిత్రాల్లోని పాటలకు గంగూలీతో కలిసి శ్రీదేవి స్టెప్పులేసింది. ఈ కార్యక్రమం త్వరలో ప్రసారం కానుంది. శ్రీదేవితోపాటు ఆమె భర్త బోనీ కపూర్, నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా హాజరయ్యారు.