: ‘సర్జన్ జనరల్ ఆఫ్ అమెరికా’గా డాక్టర్ జెరోమ్ ఆడమ్స్ నియామకం
‘సర్జన్ జనరల్ ఆఫ్ అమెరికా’గా డాక్టర్ జెరోమ్ ఆడమ్స్ ను నియమించినట్టు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఇండియానా ఆరోగ్యశాఖ కమిషనర్ గా ఉన్న జెరోమ్ ఆడమ్స్ ను అమెరికా ప్రధాన సర్జన్ గా యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ నియమించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, హెచ్ఐవీ వైరస్ నిర్మూలన నిమిత్తం పరిశోధనలు చేస్తున్న వారికి కీలక సలహాదారుగా జెరోమ్ వ్యవహరిస్తున్నారు. అదే విధంగా, దేశ ప్రజల ఆరోగ్య భద్రత కోసం తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా ఆయన ట్రంప్ కు సలహాలు ఇవ్వనున్నారు. 2014లో ఇండియానా హెల్త్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన జెరోమ్, అదే సమయంలో గవర్నర్ గా కూడా వ్యవహరించారు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది ప్రారంభంలో ‘సర్జన్ జనరల్ ఆఫ్ అమెరికా’ పదవి నుంచి భారత సంతతికి చెందిన డాక్టర్ వివేక్ మూర్తిని డొనాల్డ్ ట్రంప్ తప్పించారు.