: 'దాసరి మరణానికి అసలు కారణం ఇదే' అంటున్న ఆయన శిష్యుడు!
దర్శకరత్న దాసరి నారాయణరావు మరణానికి గల అసలు కారణాన్ని ఆయనకు ఎంతో దగ్గరి మనిషైన దర్శకుడు రేలంగి నరసింహారావు బయటపెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పారు. అధిక బరువుతో దాసరి నారాయణరావు బాగా ఇబ్బంది పడేవారని, దాన్ని తగ్గించుకోవడానికి ఆయన చికిత్సలు చేయించుకునేవారని తెలిపారు. ఇందులో భాగంగా కడుపులో బెలూన్ చికిత్స చేయించుకున్నారని, అప్పటి నుంచి కేవలం ద్రవాహారం తీసుకోవడం వల్ల కొంత బరువు తగ్గినట్లు ఆయన వివరించారు.
మంచి ఫలితాలు కనిపించడంతో రెండోసారి కూడా బెలూన్ చికిత్స చేయించుకోవడానికి వెళ్లడమే ఆయన ప్రాణాలను బలిగొందని, లేకపోతే ఇంకో పదేళ్లు బ్రతికే వారని రేలంగి అన్నారు. రెండోసారి చికిత్సకు వెళ్లినపుడు ఘనాహారం తీసుకునేలా చికిత్సలో మార్పులు చేయించడం బెడిసికొట్టిందని, విధిరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుందని, సినీపరిశ్రమకు దాసరి లేని లోటు తీర్చలేనిదని ఆయన బాధపడ్డారు.