: నేను అందుకున్న జెర్సీల్లో ఇవి ప్రత్యేకమైనవి: క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్
ఇంగ్లాండ్ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ తనకు బహుమతిగా వచ్చిన ప్రముఖ క్రికెటర్ల జెర్సీలు, క్యాప్ లను చాలా భద్రంగా దాచుకున్నాడు. ఈ విషయాన్ని స్టువర్ట్ బ్రాడ్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపాడు. ‘నేను అందుకున్న జెర్సీల్లో ఇవి ప్రత్యేకమైనవి. అందరూ గొప్ప ఆటగాళ్లే’ అని పేర్కొన్న స్టువర్ట్ బ్రాడ్, ఓ ఫొటోను జత చేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియన్ క్రికెటర్ మిచెల్ జాన్సన్, ఇంగ్లాండ్ ప్లేయర్ డారెన్ గాఫ్, పాక్ ఆటగాడు యూనిస్ ఖాన్ లకు చెందిన జెర్సీలతో పాటు కొన్ని క్యాప్స్ ను కూడా బ్రాడ్ తన నివాసంలో భద్రంగా దాచుకున్నాడు.