: రోడ్డు ప్రమాదంలో వర్ధమాన హీరో అస్లాం మృతి
వర్ధమాన టాలీవుడ్ హీరో మృత్యువాతపడ్డాడు. మూడేళ్ల క్రితం ఉద్యోగం కోసం వరంగల్ నుంచి హైదరాబాదుకు వచ్చిన అస్లాం సినీ రంగంలో ఉన్న మిత్రుల సాయంతో హీరోగా ఎదిగాడు. ఏడాది కాలంగా 'ప్రేమమయం' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆడియో విడుదల చేసి, సినిమా విడుదలకు ముహూర్తం కూడా పెట్టుకున్నారు. విడుదల కావడమే ఇక ఆలస్యం...ఇంతలోనే రంజాన్ వేడుకలు నిర్వహించుకునేందుకు వరంగల్ లోని శివనగర్ లోని ఇంటికి వెళ్లిన అస్లాం...తిరిగి స్నేహితుడితో కలిసి హైదరాబాదు వస్తూ హన్మకొండ–హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారిపై బిబీనగర్ సమీపంలో ద్విచక్రవాహనం ఆదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తొలి సినిమాను వెండితెరపై చూసుకోకుండానే వెళ్లిపోయాడంటూ స్నేహితులు, చిత్ర యూనిట్ ఆవేదన వ్యక్తం చేసింది.