: ‘మరుదనాయగం’పై కమల్ సంచలన నిర్ణయం


ప్రముఖ విలక్షణ నటుడు కమలహాసన్ సుమారు ఇరవై ఏళ్ల క్రితం ప్రారంభించిన చిత్రం మరుదనాయగం.1997లో బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ చేతుల మీదుగా చాలా అట్టహాసంగా ఈ చిత్రం షూటింగ్ ను ప్రారంభించారు. అయితే, ఆర్థిక సమస్యల కారణంగా మరుదనాయగం చిత్రం మొదట్లోనే ఆగిపోయింది.

 ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాణం ఇక పూర్తి కాదని సినీ వర్గాలు అనుకున్నాయి. ఈ విషయమై కమల్ ఇటీవల స్పందిస్తూ, ‘మరుదనాయగం’ను సినిమాగానే కాకుండా వెబ్ సిరీస్, టీవీ సిరీస్ రూపంలో వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కాగా, కమల్ తాజా చిత్రం ‘శభాష్ నాయుడు’ షూటింగ్ మళ్లీ తిరిగి మొదలుపెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News