: రాందేవ్ బాబాగా అజయ్ దేవగణ్!


యోగా గురువు, పతంజలి బ్రాండ్ వెన్నెముక రాందేవ్ బాబా జీవిత చరిత్రను ఓ చిత్రంగా తీయనుండగా, అందులో హీరోగా అజయ్ దేవగణ్ నటించనున్నట్టు తెలుస్తోంది. మొదట్లో రాందేవ్ పై ఓ టీవీ షో చేయాలనుకుని అందులో పాత్ర కోసం విక్రాంత్ మన్సే అనే నటుడిని కూడా ఎంపిక చేసుకున్నారు. ఆపై టీవీ షో రద్దు కాగా, సినిమా నిర్మించాలని తలచిన నిర్మాతలు అజయ్ ని సంప్రదించడం, ఆయన ఓకే చెప్పడం జరిగినపోయినట్టు సమాచారం. ఈ చిత్రంలో వివిధ రాజకీయ పార్టీలు, నేతలతో రాందేవ్ కు ఉన్న సంబంధాలతో పాటు పతంజలి బ్రాండ్ ఆలోచన ఎలా వచ్చింది? ఎలా ఎదిగిందన్న అంశాలనూ ప్రస్తావిస్తారని తెలుస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

  • Loading...

More Telugu News