: హమ్మయ్య.. 2012 నుంచి మోకాళ్ల మీద నిలబడి ప్రపోజ్ చేస్తుంటే ఇప్పటికి ఓకే చెప్పిందంటున్న క్రికెటర్!


ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఒకింటివాడు కానున్నాడు. తన ప్రేయసి డానీ విల్స్ (26) ను వివాహం చేసుకోనున్నాడు. 2012లో బిగ్ బాష్ లీగ్ సందర్భంగా ఒక బార్ లో వారిద్దరికీ తొలిసారి పరిచయమైంది. అది ప్రేమగా మారి వివాహానికి దారితీసింది. మెక్ క్వారీ విశ్వవిద్యాలయంలో ఆమె న్యాయవిద్యనభ్యసిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం హాలీడేను ఎంజాయ్ చేస్తున్న స్మిత్, న్యూయార్క్ లోని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టాప్‌ ఆఫ్‌ ద రాక్‌ లో ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఆమె సరే అనడంతో సంబరాల్లో మునిగిపోయాడు. ఈ నేపథ్యంలో ప్రియురాలితో దిగిన ఫోటో పోస్టు చేసిన స్మిత్.... 2012 నుంచి ఎన్నో సార్లు మోకాళ్ల మీద నిల్చుని ప్రపోజ్ చేశానని, ఎట్టకేలకు యస్ చెప్పిందని అన్నాడు. 

  • Loading...

More Telugu News