: ఉగ్రవాద కదలికలను పసిగట్టే క్రమంలో... అమర్‌నాథ్ యాత్రలో డ్రోన్ల నిఘా!
అమర్‌నాథ్ యాత్ర చరిత్రలో మొదటి సారిగా యాత్రికుల రక్షణార్థం డ్రోన్లను ఉపయోగించనున్నారు. ఈ విషయమై హోం మంత్రిత్వశాఖ సమావేశంలో మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అనుమతినిచ్చారు. అమర్‌నాథ్‌కు వెళ్లే మార్గంతో పాటు జమ్మూ కాశ్మీర్‌లోని బేస్ క్యాంప్‌ల వద్ద డ్రోన్ల నిఘా ఏర్పాటు చేయనున్నారు. పర్వతాల గుండా సాగే ఈ ప్రయాణంలో యాత్రికులకు రక్షణ కల్పించడంలో డ్రోన్ల సహకారం అక్కడి రక్షణ దళాలకు బలం చేకూర్చనుంది. చిన్న చిన్న ఉగ్రవాద కదలికలను సైతం పసిగట్టి వారు అలజడి సృష్టించక ముందే మట్టుపెట్టే సౌకర్యం కలిగింది. ఏడాదికి ఒక్కసారి జరిగే అమర్‌నాథ్ యాత్ర జూన్ 29 నుంచి ఆగస్టు 7 వరకు కొనసాగుతుండటంతో రక్షణ, విపత్తు నిర్వహణ శాఖలను హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అప్రమత్తం చేశారు.