: వైకాపా వైపు చూస్తున్న యువత... తదుపరి ఎన్నికల్లో గెలిచేది జగనే: మాజీ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో యువత తమ భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తోందని, తదుపరి ఎన్నికల్లో విజయం సాధించి సీఎం అయ్యేది జగనేనని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
"ప్రజల మనసులను, వారి అభిప్రాయాలను పరిశీలించాను. వచ్చే ఎన్నికల్లో యువతే కీలకమని భావించాలి. హీ షుడ్ విన్... జగన్ మోహన్ రెడ్డి షుడ్ విన్. నా ఫీలింగ్ అతను గెలుస్తాడన్న భావం ఉంది. అతనికే ఆ స్కోప్ ఉంది. తెలంగాణలో నేను చెప్పలేను. అటూ ఇటుగా ఉంది. ఇంకా తెలంగాణ ఫీలింగ్ ప్రజల్లో ఉందని అనుకుంటున్నాను.
ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి జీరో. నా కుమారుడు మనోహర్ సంగతేంటన్న విషయాన్ని అతన్నే అడగండి. నేనేమీ సలహాను అతనికి ఇవ్వను. అతని ఇష్టం అతనిది. స్పీకర్ గా మాత్రం మనోహర్ ఫస్ట్ క్లాస్. చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను నిర్వర్తించాడు" అని కితాబిచ్చారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు తప్పని, స్పీకర్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోకపోవడం ఇంకా పెద్ద తప్పని అభిప్రాయపడ్డ నాదెండ్ల, ఓ పార్టీపై గెలిచి మరో పార్టీలోకి జంప్ చేసే వారిపై నిర్ణయాధికారం ఎన్నికల కమిషన్ కు అప్పగిస్తూ చట్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.