: వెనిజులా సుప్రీంకోర్టుపై గ్రనేడ్ దాడి చేసింది హాలీవుడ్ నటుడు: తేల్చిన పోలీసులు


వెనిజులా రాజధాని కారకస్ లో సుప్రీంకోర్టు భవనంపై బుధవారం హెలికాప్టర్ తో గ్రనేడ్ల దాడి జరిగింది. ఈ దాడికి ఆస్కార్ పెరెజ్ అనే పోలీసు అధికారి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అతను వాడిన హెలికాప్టర్ కరీబియన్ తీర ప్రాంతంలో లభ్యమైందని వారు చెప్పారు. కాగా, ఆస్కార్ పెరెజ్ హాలీవుడ్ నటుడని, 2015లో హాలీవుడ్ యాక్షన్ సినిమాలో పెరేజ్ నటించాడని వారు తెలిపారు. అతనికి ఇన్ స్టా గ్రాం ఖాతా కూడా ఉందని వారు చెప్పారు. సినిమాల కోసం చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడని, అతని కోసం గాలిస్తున్నామని వెనిజులా పోలీసులు తెలిపారు. 

  • Loading...

More Telugu News