: నేను ఇంతవరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ హీరోనే!: నటి టబూ


ప్రముఖ సినీ నటి టబూ ఇంతవరకు పెళ్లి చేసుకోని విషయం తెలిసిందే. తాను పెళ్లి చేసుకోక పోవడానికి కారణం బాలీవుడ్ హీరో అజయ్ దేవగణే అని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అజయ్ తనకు పాతికేళ్లుగా తెలుసని... ఒకప్పుడు తన కజిన్ సమీర్ ఇంటిపక్కనే అజయ్ ఉండేవాడని... అప్పుడు తామంతా మంచి స్నేహితులుగా ఉండేవారమని టబూ చెప్పింది. సమీర్ తో కలసి అజయ్ తనను ఓ కంట కనిపెడుతుండేవాడని... తాను ఎక్కడకు వెళ్లినా ఫాలో అయ్యేవాడని... వేరే అబ్బాయిలు ఎవరైనా తనవైపు చూసినా, మాట్లాడినా కొట్టేవాడని తెలిపింది. తనకు పెళ్లి కాకపోవడానికి ముమ్మాటికీ అజయే కారణమని చెప్పింది. ఈ విషయాన్ని ఇప్పటికైనా ఆయన గుర్తించాలని తెలిపింది. హీరోల్లో అజయ్ అంటేనే తనకు ఎక్కువ ఇష్టమని... తనను బాగా చూసుకుంటాడని చెప్పింది. తమ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనదని తెలిపింది. ప్రస్తుతం అజయ్ దేవగణ్ సినిమా 'గోల్ మాల్ ఎగైన్'లో టబూ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

  • Loading...

More Telugu News