: 'గ్రేట్‌' అపరాజితా


మనం రోజూ చూస్తుంటే మనకు చాలా రకాలైన పక్షులు కనిపిస్తుంటాయి. కానీ వీటన్నింటిలో విలక్షణమైనవి గ్రేట్‌ హార్న్‌బిల్‌ పక్షులు. విలక్షణమైన ఈకలు, ముక్కు కలిగిన ఈ పక్షులు అరుణాచల్‌ ప్రదేశ్‌ అడవుల్లో కనిపిస్తాయి. ఇంకా సుమత్రా, ఇండోనేషియా, నేపాల్‌ వంటి పలు దేశాల్లో హార్న్‌బిల్‌ పక్షులు కనిపిస్తుంటాయి. అయితే ఇవి అంతరించిపోయే ప్రమాదముంది. అందుకోసం వీటిని సంరక్షించేందుకు ప్రముఖ పక్షి సంరక్షకురాలు అపరాజితా దత్తా నడుంకట్టారు. దీనికి ప్రతిగా ఆమెను ప్రత్యేక అవార్డు వరించింది.

హార్న్‌బిల్‌ పక్షులు కేరళ, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ చిహ్నాలు. అయితే ఈ పక్షులు అంతరించిపోతున్నాయి. వీటిని కాపాడేందుకు అపరాజితా దత్తా బృందం ఎంతో కృషి చేశారు. వీరి కృషికి గుర్తింపుగా వైట్‌లీ అవార్డుకు వీరిని ఎంపిక చేశారు. ఈ అవార్డు గ్రీన్‌ ఆస్కార్‌ అవార్డుగా ఎంతో సుప్రసిద్ధమైంది. లండన్‌లోని రాయల్‌ జియోగ్రాఫికల్‌ సొసైటీలో జరిగే కార్యక్రమంలో అపరాజితకు ఈ అవార్డును ప్రదానం చేశారు. గురువారం నాడు జరిగిన ఒక కార్యక్రమంలో క్వీన్‌ ఎలిజబెత్‌-2 కుమార్తె ప్రిన్సెన్‌ యాన్నే చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు కింద 'వైట్‌లీ ఫండ్‌ ఫర్‌ నేచర్‌' సంస్థ వారు2.95 లక్షల పౌండ్లు అంటే రూ. 2.46 కోట్ల సొమ్మును ఈ బృందంలోని మరో ఏడుగురు సభ్యులు కలిసి పంచుకోనున్నారు.

  • Loading...

More Telugu News