: మధ్యప్రదేశ్ లో 50 కార్లను ధ్వంసం చేసి పారిపోయిన గుర్తు తెలియని వ్యక్తులు!


మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్ లో గ‌త అర్ధ‌రాత్రి క‌ల‌క‌లం చెల‌రేగింది. కొంద‌రు గుర్తు తెలియని వ్య‌క్తులు ఒక వర్గం వారి సుమారు 50 కార్లను ధ్వంసం చేశారు. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు వివ‌రాలు తెలిపారు. కొత్వాలీ ప్రాంతంలో పార్క్‌ చేసి ఉన్న కార్లపై ఆ దుండ‌గులు దాడి చేశార‌ని, తెల్లవారు జామున 2.30 నుంచి 3 గంటల వరకు ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డార‌ని తెలిపారు. తాము స‌మాచారం అందుకుని వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుంటుండగా బైక్‌లపై ఆ దుండ‌గులు పారిపోయార‌ని చెప్పారు. ఆ ఘ‌ట‌న‌పై ఆ కార్ల యజమానులు స్పందించి జాతీయ రహదారిపై త‌మ‌ ధ్వంసమైన కార్లను ఉంచి నిర‌స‌న తెలిపారు. పోలీసులు నిందితుల‌ను ప‌ట్టుకోవడానికి సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలిస్తున్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకే కొంద‌రు ఈ ప‌నిచేసుంటార‌ని పోలీసులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News