: 15 సెకండ్ల‌లో 50 ప‌చ్చి గుడ్ల‌ సొనలను తాగేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు!


ఒక యువ‌కుడు 50 గుడ్ల‌ను ఒక‌దాని త‌రువాత మ‌రొకటి ప‌గుల‌గొట్టి 5 పెద్ద బీరు గ్లాసుల నిండా వాటి తెల్ల‌, ప‌చ్చ సొన‌ల‌ను నింపాడు. ఆ త‌రువాత‌ కేవ‌లం 15 సెకండ్ల‌లో ఆ 50 గుడ్ల సొన‌ను తాగేశాడు. అలా చేస్తున్న‌ప్పుడు తీసిన వీడియోను సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశాడు. మంచినీళ్ల క‌న్నా వేగంగా అంతేసి పెద్ద గ్లాసుల‌లోని సొన‌ను ఆ యువ‌కుడు తాగేయ‌డంపై నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్యక్తం చేస్తున్నారు. కొంద‌రు శ‌భాష్ అని కితాబిస్తోంటే, మ‌రికొంద‌రు ఇటువంటివి చేసి ప్రాణాలమీద‌కు తెచ్చుకోవద్దంటూ హెచ్చ‌రిస్తున్నారు. కోడిగుడ్ల సొన‌లో స‌ల్మొనెల్లా అనే హానిక‌ర‌మైన బ్యాక్టీరియా ఉంటుంద‌ని, దాన్ని ఇలా తాగేస్తే  ఆరోగ్య స‌మస్య‌లు వ‌స్తాయ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. మొత్తానికి ఈ వీడియోతో ఆ యువ‌కుడు ఫేమ‌స్ అయిపోయాడు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఈ వీడియోను మీరూ చూడండి..

  • Loading...

More Telugu News