: ‘థ్యాంక్యూ బ్రదర్’ అంటూ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసిన కోన వెంకట్
థ్యాంక్యూ బ్రదర్ అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు సినీ రచయిత కోన వెంకట్ ట్వీట్ చేశారు. జీఎస్టీ అమలులోకి వస్తున్న నేపథ్యంలో సినిమాకు విధించే పన్ను విషయంలో తమ రాష్ట్ర సినీ పరిశ్రమకు అనుకూలంగా కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ఓ మంచి నిర్ణయం తీసుకోవాలని కోన వెంకట్ ఈ రోజు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అందుకు కేటీఆర్ స్పందిస్తూ.. తమ మంత్రులు ఈ రోజు ఈ అంశంపైనే చర్చించనున్నారని తెలిపారు.
దీంతో మరోసారి ఈ అంశంపై ట్వీట్ చేసిన కోన వెంకట్ థ్యాంక్యూ బ్రదర్ అని పేర్కొన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి వాటిని పరిష్కరించడానికి తగిన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అటువంటి తెలంగాణ సర్కారుపై తమకు నమ్మకం ఉందని, ఇప్పుడు తాము ఇబ్బందుల్లో ఉన్నామని, తమను కాపాడాలని ఆయన కోరారు.