: కేసీఆర్, కేటీఆర్ లపై విమర్శలు గుప్పించిన కిషన్ రెడ్డి
తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై బీజేపీ శాసనసభాపక్షనేత కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పి ఓట్లు వేయించుకున్నారని, మూడేళ్ల పాలనలో చేసిందేమీలేదని అన్నారు. కేసీఆర్ గాలిలో మేడలు కడుతున్నారని, మున్సిపల్ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలు చేస్తూ హైదరాబాద్ కూడా అలాగే ఉందనే అపోహలో ఉన్నారని విమర్శించారు. ఈ విషయమై సామాజిక మాధ్యమాల్లో కేటీఆర్ పై జోక్స్ పేలుతున్నాయని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం లోపించిందని, హైదరాబాద్ నగరంలో కొన్నిచోట్ల వారానికోసారి కూడా మంచినీళ్లు రావడం లేదని, మెట్రో రైలు పనులు పడకేశాయని విమర్శించారు.