: రికార్డు స్థాయికి చేరిన ఫేస్ బుక్ వినియోగదారులు...ప్రపంచంలో నాలుగోవంతు ఎఫ్బీలోనే!


సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ రికార్డు స్థాయి వినియోగదారులతో దూసుకుపోతోంది. ఇప్పటికే అత్యధిక వినియోగదారులు కలిగిన ఫేస్ బుక్... మరింత వేగంగా విస్తరిస్తోంది. ప్రతినెలా ఫేస్ బుక్ ను చురుగ్గా వాడే వినియోగదారుల సంఖ్య పెరుగుతోందని ఫేస్ బుక్ వైస్ ప్రెసిడెంట్ నవోమి గ్లీట్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో నాలుగోవంతు ప్రజలు ఫేస్ బుక్ ను వినియోగిస్తున్నారని ఆమె చెప్పారు. సుమారు 200 కోట్ల మంది ఫేస్ బుక్ ను చురుగ్గా వినియోగిస్తున్నారని ఆమె తెలిపారు. 

  • Loading...

More Telugu News