: హైద‌రాబాద్ స‌హా తెలంగాణ‌లో భారీ వ‌ర్షం


తెలంగాణ రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం ప‌డుతోంది. క‌రీంన‌గ‌ర్ జిల్లా, రాజ‌న్న సిరిసిల్ల జిల్లా, జ‌గిత్యాల జిల్లాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంది. జ‌గిత్యాల, గొల్ల‌ప‌ల్లి, శంక‌ర‌ప‌ట్నం, జమ్మికుంట, చొప్పదండి, ఇల్లంత‌కుంట మండ‌లాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం ప‌డుతోంది. తంగ‌ప‌ల్లి మండలం రామ‌న్నప‌ల్లిలో పిడుగుపాటుకు ఓ గొర్రెల కాప‌రి మృతి చెందాడు. మ‌రోవైపు హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లోనూ భారీ వ‌ర్షం కురుస్తోంది.  హైద‌రాబాద్‌లోని జూబ్లిహిల్స్, వెంక‌ట‌గిరి, ఎస్సార్ న‌గ‌ర్‌, యూసఫ్‌గూడ‌, నాంప‌ల్లి ప‌రిసర ప్రాంతాల్లో వ‌ర్షం ప‌డుతోంది.    

  • Loading...

More Telugu News