: దొంగచాటుగా లేఖలు రాయాల్సిన అవసరం మాకు లేదు: అంబటి రాంబాబు


ప్రపంచ బ్యాంక్ కు దొంగచాటుగా లేఖలు రాయాల్సిన అవసరం వైసీపీకి లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఈ విషయమై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, వైసీపీపై ఆరోపణలు చేయడం టీడీపీకి అలవాటుగా మారిందని, మాపై నిందవేయాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. తమపై చేసిన ఏ ఒక్క ఆరోపణనూ టీడీపీ ప్రభుత్వం నిరూపించలేకపోయిందని, రాజధాని అభివృద్ధి కాకుంటే అందుకు, వైసీపీయే కారణమంటూ తమపై నిందవేయాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News