: మెలానియా ట్రంప్ ధరించిన పసుపు రంగు డ్రెస్ ఖరీదు ఎంతంటే...!
అమెరికా పర్యటనలో ప్రధాని మోదీకి యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మెలానియా దంపతులు సాదర స్వాగతం పలికిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెలానియా ధరించిన పసుపు రంగు డ్రెస్ (పుక్కి) ఎంతో అందంగా ఉందంటూ ప్రశంసలు వెల్లువెత్తిన సంగతీ తెలిసిందే. పసుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ డ్రెస్ పై నలుపు, తెలుపు రంగుల్లో ఉన్న పూల డిజైన్ మరింత అందాన్ని ఇవ్వడమే కాదు.. చూడముచ్చటగానూ ఉంది.
అయితే, ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ డ్రెస్ ఖరీదు కూడా ఒక రేంజ్ లోనే ఉంది. దీని ఖరీదు 2,160 డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.1,39,180. కాగా, గతంలో ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్ బుల్ ను కలిసినప్పుడు, ఇటీవల జరిపిన పర్యటనల్లోనూ మెలానియా మోడ్రన్ దుస్తుల్లో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. అందుకు భిన్నంగా.. మోదీకి స్వాగతం పలికే సమయంలో నిండైన దుస్తుల్లో మెలానియా కనిపించడం గమనార్హం.