: ఏడాదిన్నరగా మహాభారతం చదువుతున్నా!: షారుఖ్
గతంలో మహాభారతాన్ని సినిమాగా చేస్తే నటించడానికి సుముఖత వ్యక్తం చేసిన బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ తాను గత ఏడాదిన్నరగా మహాభారతం చదువుతున్నట్లు తెలిపాడు. `నేను ఏడాదిన్నరగా మహాభారతం చదువుతున్నా. అందులో కథ, కథనాలు నాకు చాలా బాగా నచ్చాయి. మా అబ్‌రామ్‌కి అర్థమయ్యేలా ఆ కథల్ని వాడికి చెబుతుంటాను. అలాగే ఇస్లాం కథలు వాడికి చెప్తాను. నాకు అన్ని మతాల పట్ల గౌరవం ఉంది. నా పిల్లలు కూడా అలాగే ఉంటారనుకుంటున్నా. అన్ని మతాల సారం తెలుసుకొని అందులో మాధుర్యాన్ని వారు ఆస్వాదించాలనేది నా కోరిక` అంటూ ఈద్ సందర్భంగా షారుఖ్ చెప్పాడు.
చిత్రసీమలో పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే తన పిల్లల సినీరంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ - `ముందు వాళ్లు చదువులు పూర్తి చేయాలి. కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయనిదే మా ఇంట్లో కుదరదు. మా పిల్లల విషయంలో అలా జరగడానికి ఇంకా చాలా సమయం ఉంది` అంటూ చెప్పుకొచ్చాడు షారుఖ్.