: శ్రీకాకుళం జిల్లాలో 20 అడుగుల ముందుకు చొచ్చుకు వచ్చిన సముద్రం!


శ్రీకాకుళం జిల్లాలో సముద్రం ఏకంగా 20 అడుగుల మేర ముందుకు చొచ్చుకు వచ్చింది. గార మండలం బందారువారిపేట గ్రామం వద్ద ఇది సంభవించింది. ఈ నేపథ్యంలో, సముద్రపు అలలు గ్రామాన్ని తాకుతూ భయోత్పాతాన్ని కలిగిస్తున్నాయి. దీంతో, గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మత్స్యకారులు చేపల వేటను నిలిపివేశారు. సముద్రం వెనక్కి వెళ్లిన తర్వాతే మళ్లీ చేపల వేటకు వెళతామని వారు తెలిపారు. 

  • Loading...

More Telugu News