: ఏసీబీ అధికారుల కళ్లు బైర్లు కమ్మేలా సంపాదించిన పాండురంగారావు!
అవినీతి కట్టలపాము, ప్రజారోగ్యశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ పాము పాండురంగారావు ఆస్తులను చూసి ఏసీబీ అధికారుల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. 2007 నుంచి విశాఖపట్టణం మున్సిపల్, ప్రజారోగ్య శాఖల్లో ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పాండురంగారావు పని చేస్తున్నారు. స్వదేశీ, విదేశీ నోట్ల కట్టలు, బంగారు నగలు, నాణేలు, వాచ్ లు, పూజ సామగ్రి, వజ్రాభరణాలు, వెండి కంచాలు, ఆఖరుకి వెండి తాపీ తదితరాలు చూసిన ఏసీబీ అధికారులు నోళ్లెళ్లబెట్టారు.
భారీ ఎత్తున ఆయన భూములు కొనుగోళ్లు నిర్వహించినట్టు తెలియగా, ఆయన లాకర్ల నుంచి బయల్పడిన పత్రాలు మరిన్ని ఫ్లాట్లు, ప్లాట్ల వివరాలను వెల్లడించాయి. తాజాగా విశాఖ జిల్లాతోపాటు తూర్పుగోదావరి జిల్లాలోని రెండు బ్యాంకుల్లో ఆయనకు సంబంధించిన లాకర్లు కూడా తెరిచారు. ఈ ఆస్తులన్నీ లెక్కగడితే మొత్తం 1000 కోట్ల రూపాయల వరకు ఉంటాయని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.