: రాజీవ్ కు తెలియకుండా శిరీషతో చాలా సార్లు గొడవపడ్డా: తేజస్విని
ఇరు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తున్న బ్యూటీషియన్ శిరీష మృతి కేసుకు సంబంధించి నిందితుడు రాజీవ్ ప్రియురాలు తేజస్విని తన వాంగ్మూలాన్ని ఇచ్చింది. తాను ప్రేమించిన రాజీవ్ తో శిరీష సన్నిహితంగా ఉండటంతో తాను సంఘర్షణకు లోనయ్యానని వాంగ్మూలంలో ఆమె పేర్కొంది. కేవలం శిరీష వల్లే తనకు, రాజీవ్ కు మధ్య దూరం పెరుగుతోందనే అనుమానం తనకు కలిగిందని... అది రోజురోజుకూ పెరుగుతూ వచ్చిందని తెలిపింది.
ఈ నేపథ్యంలో రాజీవ్ కు తెలియకుండా శిరీషతో తాను అనేక సార్లు గొడవపడ్డానని చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి తాను, శిరీష పోలీస్ స్టేషన్ లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నామని తెలిపింది. రాజీవ్ ను పెళ్లి చేసుకుంటానని అతని తల్లిదండ్రులను కూడా అడిగానని చెప్పింది.