: ఇద్దరమ్మాయిలు ముంజేతి పట్టు పడితే, ఎముక విరిగింది... లక్షల వ్యూస్ తెచ్చుకున్న వీడియో ఇది!
అర్జంటీనాలోని ఓ టీవీ చానల్ నిర్వహిస్తున్న 'ఎన్ క్యూ మనో ఇస్తా?' అనే గేమ్ షోలో దురదృష్టకర ఘటన జరిగింది. పోటీదారులు తమ ఫిజికల్ ఫిట్ నెస్ ను నిరూపించుకునేలా సవాళ్లను ఎదుర్కోవాల్సిన గేమ్ షో లైవ్ జరుగుతుండగా, ఇద్దరు యువతులు ముంజేతి పట్టు పట్టారు. కేవలం కొన్ని సెకన్లలోనే 'టప్'మన్న శబ్దం వచ్చింది. పమేలా అనే పోటీదారు ముంజేతి ఎముక విరిగింది.
ఆ వెంటనే జరిగిందేమిటో తెలుసుకున్న సహ పోటీదారు, దిగ్భ్రాంతికి గురై, ఆమె చేతిని కదపకుండా పట్టుకోగా, మెడికల్ సిబ్బంది పరుగున వచ్చి ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. తన చెయ్యి విరిగినా, పమేలా ఎటువంటి బాధనూ వ్యక్తం చేయకుండా వైద్య సిబ్బందితో కలసి స్టేజ్ దిగగా, రెండో పోటీదారు కళ్ల వెంబడి నీళ్లు వచ్చాయి. ఈ వీడియోను సదరు చానల్ సోషల్ మీడియాలో పంచుకోగా, లక్షలాది మంది చూసి, పమేలా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.