: అనంతపురం జిల్లా లేపాక్షి పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్!


అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షిలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక పోలీస్ స్టేషన్ లో గోపాల్ అనే నిందితుడిని పోలీసులు చితకబాదడంతో అతను మృతి చెందాడు. గోపాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మృతుడి బంధువులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కాగా, ఈ సంఘటనపై పోలీసు అధికారులు స్పందించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News