: భూ కుంభకోణాలపై బాగా పోరాడుతున్నారు!: టీటీడీపీ నేతలను అభినందించిన చంద్రబాబు!
భూ కుంభకోణాలు, ఇతర సమస్యలపై టీటీడీపీ నేతలు చేస్తున్న పోరాటాలు అభినందనీయమని ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశంసించారు. టీటీడీపీ నేతలు ఎల్. రమణ, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, గరికపాటి రామ్మోహన్ రావు, నామా నాగేశ్వరరావు ఈరోజు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా భూ కుంభకోణాలు, ఇతర సమస్యలపై టీటీడీపీ నేతలు పోరాడటాన్ని చంద్రబాబు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని, నియోజకవర్గ ఇన్ చార్జిలు, జిల్లా, రాష్ట్ర కమిటీల ఏర్పాటు కోసం త్వరలో అమరావతిలో సమావేశం కావాలని నిర్ణయించారు.