: మేము అధికారంలోకి రాగానే జయలలిత మృతిపై విచారణకు కమిషన్ వేస్తాం: డీఎంకే నేత స్టాలిన్


తాము అధికారంలోకి రాగానే జయలలిత మృతిపై విచారణకు ఓ కమిషన్ వేస్తామని డీఎంకే నేత స్టాలిన్ అన్నారు. వేలూరు జిల్లా రాణీపేటలో ఈ రోజు జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జయలలిత మృతి వెనుక కుట్ర దాగి ఉన్నట్లు తేలితే దోషులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేదని, బినామీల ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు చెల్లించి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల మద్దతుతో బినామీ ప్రభుత్వం నడుస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల అనంతరం తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం పడిపోవడం, తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని స్టాలిన్ జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News