: విండీస్ ఆటగాడి ఇంట్లో ఎంజాయ్ చేసిన కోహ్లీ, ధోనీ, రహానే, ధావన్!
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు తమకు సమయం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. టీమిండియా ఆటగాళ్లకు వెస్టండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో నిన్న రాత్రి తన ఇంట్లో పార్టీ ఇచ్చాడు. నిన్న మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ, రహానె, ధావన్ తదితరులు బ్రావో ఇంటికి వెళ్లారు. బ్రావో ఇంట్లో తాము గడిపామని టీమిండియా ఓపెనర్ శిఖర్‌ధావన్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. వీరు రాకముందే డ్వేన్ బ్రావో ఇంటికి ధోనీ తన కుమార్తె జీవాతో కలిసి వెళ్లాడు. డ్వేన్ బ్రావో తన తల్లితో కలిసి ధోనీతో దిగిన ఫొటోని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.