: 'ఈద్ ముబారక్' చెప్పిన పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్
‘మానవాళికి సద్బుద్ధిని ప్రబోధించడానికి దివ్య ఖురాన్ అవతరించిన మాసం ఇది. అందువల్ల ఈ మాసం అత్యంత పవిత్రమైన మాసం’ అని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ముస్లిం సమాజానికి తన తరఫున, జనశ్రేణుల తరఫున సోదరపూర్వక శుభాకాంక్షలు, ఈద్ ముబారక్ హో అని ప్రెస్‌నోట్‌లో తెలిపారు. సినీనటుడు మహేశ్‌బాబు హ్యాపీ రంజాన్ అని తన ట్విట్టర్ ఖాతాలో ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పారు. ఈద్ ముబారక్ అని జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. దర్శకుడు మురుగదాస్, హరీశ్ శంకర్ హీరోయిన్‌లు కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలని పేర్కొన్నారు.