: చిరంజీవి వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి!: కేశినేని నాని


టీడీపీలోకి రాకముందు మూడు నెలల పాటు తాను ప్రజారాజ్యంలో ఉన్నానని విజయవాడ ఎంపీ కేశినాని అన్నారు. వ్యక్తిగతంగా చిరంజీవి చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చారు. అయితే, రాజకీయ పార్టీని మాత్రం ఆయన నడిపించలేకపోయారని చెప్పారు. ప్రజారాజ్యాన్ని వీడిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని తనకు అనిపించలేదని... ముఖ్యమంత్రి చంద్రబాబే మళ్లీ తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని తెలిపారు.

చంద్రబాబు ఆదేశాలను తాను శిరసావహిస్తానని... చివరి వరకు ఆయనతోనే ఉంటానని చెప్పారు. ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయమంటే చేస్తానని... 'నువ్వొద్దురా పో' అంటే, వెళ్లిపోయి కార్గో వ్యాపారం చూసుకుంటానని స్పష్టం చేశారు. తాను పార్టీ మారే అవకాశమే లేదని చెప్పారు. ముఖ్యమంత్రి అవుతానని వైసీపీ అధినేత జగన్ కలలు కంటున్నారని... అయితే, ప్రజలు మాత్రం ఆయనను పట్టించుకోవడం లేదని అన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేశినేని నాని పైవిధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News