: ఫేస్‌బుక్ ఫాలోవర్లలో ప్రధాని తర్వాతి స్థానాన్ని అలంకరించడంపై కోహ్లీ మాట!
భారత్‌లో ప్రధాని నరేంద్రమోదీ తర్వాత ఫేస్‌బుక్‌లో అత్యంత ఎక్కువమంది ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా రికార్డులకెక్కడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. అభిమానులు తమను అభిమానిస్తున్నారని, వారి మద్దతు తమకుందని పేర్కొన్నాడు. వారి అభిమానాన్ని వెలకట్టలేమన్నాడు. జట్టును ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని అభిమానులను కోరాడు. వారి అభిమానం భవిష్యత్తులోనూ కొనసాగాలని ఆకాంక్షించాడు. మైదానంలో తమ శ్రమకు ఇది ఉప ఉత్పత్తిలాంటిందని అభివర్ణించాడు. ఇటువంటి వార్తలు విన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుందన్నాడు.