: ట్రంప్ ట్వీట్ కు ట్వీట్ ద్వారానే నరేంద్ర మోదీ సమాధానం
తనను అమెరికాకు ఆహ్వానిస్తూ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టిన ట్వీట్ పై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ప్రతి ట్వీట్ పెడుతూ ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు. "స్వాగతం చెప్పిన అధ్యక్షుడికి కృతజ్ఞతలు. నా సమావేశం కోసం, మీతో చర్చల కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను" అని ఈ ఉదయం ట్వీట్ పెట్టారు. కాగా, అమెరికాకు చేరుకున్న మోదీకి అక్కడి అధికారులు, భారత దౌత్య సిబ్బంది ఘన స్వాగతం పలుకగా, రేపు ట్రంప్ తో చర్చలు జరపనున్న సంగతి తెలిసిందే.