: బోరు బావిలో పాప మరణించింది... వాక్యూమ్ పైప్ ద్వారా మృతదేహాన్ని తెచ్చేందుకు ప్రయత్నాలు!


రంగారెడ్డి జిల్లా ఇక్కారెడ్డి గూడెంలో ఆటలు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ లోతైన బోరు బావిలో ప‌డిన‌ చిన్నారి మీనా మరణించిందని అధికారులు స్పష్టం చేశారు. పాపను ప్రాణాలతో కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొన్న అధికారులు, వాక్యూమ్ పైప్ ద్వారా పాప మృతదేహాన్ని బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బోరు బావిలోని గాలిని బలంగా బయటకు లాగడం ద్వారా పాప దేహాన్ని బయటకు తీసుకు వస్తామని, 200 అడుగులకు పైగా లోతుకు సమాంతరంగా గుంత తీయడం సాధ్యం కాని పనని తేల్చేశారు. ఎలాగైనా ప్రాణాలతో బయటకు వస్తుందని నాలుగు రోజులుగా ఆశతో ఎదురుచూసిన పాప తల్లిదండ్రులు, ఇక పాప మృత దేహం మాత్రమే బయటకు వస్తుందని తెలిసి గుండెలవిసేలా ఏడుస్తున్నారు.

  • Loading...

More Telugu News