: టాలెంట్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ పవర్ హౌస్!: రానా
త్వరలోనే ‘నేనే రాజు నేనే మంత్రి ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నటుడు రానా ఈ రోజు ట్విట్టర్‌లో తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఓ అభిమాని జూనియర్ ఎన్టీఆర్, రానాలు అద్భుతంగా డైలాగులు చెబుతారని అన్నాడు. దీనికి రానా జూనియర్ ఎన్టీఆర్ టాలెంట్‌కు పవర్ హౌస్‌లాంటి వారని పేర్కొన్నాడు. ‘బాహుబలి 3’ చేద్దామని దర్శకుడు రాజమౌళి అడిగితే తాను సంతోషంగా చేస్తానని రానా ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.
రానా అంటే తనకు చాలా ఇష్టమని ఓ తమిళ అభిమాని ట్వీట్ చేశాడు. దీనికి రానా తన కొత్త సినిమా తమిళ భాషలోనూ వస్తోందని అన్నాడు. తాను మంచి సినిమాలు చేస్తున్నందుకు తన బాబాయ్ వెంకటేశ్ చాలా సంతోషిస్తున్నారని తెలిపాడు. మంచి కథ దొరికితే బాబాయ్ తో కలసి చేస్తానని ఓ అభిమానికి చెప్పాడు. తెలుగు వారి ట్వీట్లకే రానా సమాధానం చెబుతున్నాడని ఓ అభిమాని అనగా.. 'అరె నో యార్' అని రానా సమాధానం ఇచ్చాడు.