: డ్రస్సింగ్ రూమ్ లోని కిటికీలోంచి బయటకు చూసిన విరాట్ కోహ్లీ... వైరల్‌గా మారిన ఫొటో


టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ కిటికీలోంచి చూస్తుండగా తీసిన ఓ ఫొటో వైరల్ గా మారింది. నిన్న భారత్, వెస్టిండీస్ టీమ్‌ల‌ మ‌ధ్య జ‌రిగిన మొద‌టి మ్యాచ్‌లో టాస్ ఓడిన‌ భారత్‌ మొదట బ్యాటింగ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే, 38వ ఓవర్ అనంత‌రం వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ కు ఆటంకం క‌లిగింది.

కాస్త విరామం తర్వాత మ్యాచ్‌ని తిరిగి ప్రారంభించినప్ప‌టికీ మళ్లీ వర్షం రావడంతో మ‌రోసారి విరామం ఇచ్చారు. ఆ స‌మ‌యంలో డ్రస్సింగ్‌ రూమ్‌కు చేరుకున్న అనంత‌రం కోహ్లీ కిటికీ అద్దం వద్ద నిల్చుని బయటికి చూశాడు. ఆ స‌మ‌యంలోనే ఓ ఫొటో తీశారు. ఇది సోష‌ల్ మీడియాలోకి రావ‌డంతో నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు. అమ్మాయి కోసం చూస్తున్నావా?  కిటికీ లోంచి ఎవ‌రైనా పిలుస్తున్నారా? అనిల్‌ కుంబ్లే కనపడుతున్నాడా? అంటూ సెటైర్లు వేస్తున్నారు.    

  • Loading...

More Telugu News