: నిన్న బాహుబలి-2, నేడు డీజే.. డియర్ బాలీవుడ్, మేలుకో!: తరణ్ ఆదర్శ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'దువ్వాడ జగన్నాథం' ఓవర్సీస్ లో మొదటిరోజు భారీగా వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ప్రీమియర్ షోల ద్వారా యూఎస్, కెనడాల్లో 4 లక్షల డాలర్ల మేర వసూలు చేసిన ఈ సినిమాపై ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘నిన్న బాహుబలి-2, నేడు దువ్వాడ జగన్నాథం... తెలుగు సినీ పరిశ్రమ అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోతోంది. డియర్ బాలీవుడ్ మేలుకో’ అంటూ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేసి తెలుగు సినిమా స్థాయి ఎలా ఉందో చెప్పాడు.