: రహదారిపై స్టీల్ ప్లేట్.. దాదాపు 30 బైకులు కింద‌ప‌డిపోయాయి.. మీరూ చూడండి!


ఓ ర‌హ‌దారిపై స్టీల్ ప్లేట్ పెట్ట‌డంతో దాని పై నుంచి వెళుతూ సుమారు 30 బైకులు జారి ప‌డిపోయిన ఘ‌ట‌న చైనాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ దేశ ప‌త్రిక త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. రోడ్డుపై మామూలుగా వెళుతోన్న ద్విచ‌క్ర వాహ‌నాలు స్టీల్ ప్లేట్ పెట్టిన ఆ చోటుకి రాగానే ప‌డిపోతున్నాయి. కొంత‌మంది రోడ్డు నిర్మాణ కార్మికులు ఆ స్టీల్ ప్లేట్ ను అక్క‌డ పెట్టడంతో ఇలా జరిగింది. దీంతో చివరకు దాన్ని అక్క‌డి నుంచి తొల‌గించారు. ఈ వీడియోను మీరూ చూడండి..  

  • Loading...

More Telugu News