: వైజాగ్ లోని ఎన్ఏడీ జంక్షన్ లో కంటైనర్ లారీ బీభత్సం.. ఒకరి మృతి
విశాఖపట్టణంలోని ఎన్ఏడీ జంక్షన్ లో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. బిర్లా జంక్షన్ నుంచి గాజువాక వెళ్తున్న కంటైనర్ లారీ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ దాటిన తరువాత బ్రేకులు ఫెయిలై అదుపుతప్పింది. దీంతో ఎన్ఏడీ జంక్షన్ వద్ద జనాలపైకి దూసుకెళ్లిన కంటైనర్ లారీ హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ క్రమంలో లారీ కిందపడిన ఓ హిజ్రా నుజ్జునుజ్జైంది. పలువురు గాయపడ్డారు. దీంతో ఎన్ఏడీ జంక్షన్ భీతావహంగా మారింది.