: బీహార్ షరీఫ్ రైల్వేస్టేషన్ లో విధ్వంసానికి పాల్పడ్డ యువకులు.. టికెట్ బుకింగ్ కౌంటర్‌లోడబ్బులు లూఠీ
బీహార్‌లోని ‘బీహార్ షరీఫ్’ రైల్వే స్టేషన్‌లో ఈ రోజు నిరుద్యోగులు విధ్వంసానికి పాల్పడ్డారు. తమకు రైల్వేలో ఉద్యోగాలు కావాలంటూ ఆ స్టేషన్‌లో ఆందోళనకు దిగి రైల్వే స్టేషన్‌ను ధ్వంసం చేశారు. రైల్వే స్టేషన్‌లోని బల్లలు, పార్శిల్, బుకింగ్ కార్యాలయాల్లోని వస్తువులకు నిప్పుపెట్టి, టికెట్ బుకింగ్ కౌంటర్‌లోని డబ్బులను కాజేశారు. పార్కింగ్‌లో ఉన్న పలు వాహనాలను కూడా తగులబెట్టినట్లు తెలుస్తోంది. విధ్వంసం సృష్టించిన తరువాత పోలీసులు అక్కడకు రాకముందే నినాదాలు చేస్తూ అక్కడి నుంచి ఆందోళనకారులు వెళ్లిపోయారు. బీహార్ షరీఫ్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ శ్యామ్ చౌదరి ఈ ఘటనపై స్పందిస్తూ.. తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు.