: ఈగ రోబో వస్తోంది!


రోబోల సృష్టిమీద రోజు రోజుకూ మనవారిలో ఆసక్తి పెరిగిపోతోంది. పనులను చేసిపెట్టేందుకు కొందరు రోబోలను తయారుచేస్తుంటే, అంధులకు, వికలాంగులకు సహాయం చేసేందుకు అనుగుణంగా మరికొందరు రోబోలను సృష్టిస్తున్నారు. అయితే అతి బుల్లి రోబోకు రూపకల్పన చేశారు హార్వర్డ్‌ శాస్త్రవేత్తలు. ఈగ లాగా ఎగిరే ఈ రోబో ఆకారం కూడా ఈగ లాగే ఉంది. ఈ రోబో రూపకల్పనకు పన్నెండేళ్లు పాటు శ్రమించినట్టు ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించిన రాబర్ట్‌ ఉడ్‌ చెబుతున్నారు.

మిల్లీమీటరుకన్నా తక్కువ స్థాయి కలిగిన విడి పరికరాలను తయారు చేసి వాటిని ఈ ఈగ రోబో శరీరానికి అనుసంధానించారు. దీని శరీరాన్ని కార్బన్‌ ఫైబర్‌తో తయారు చేసి దానికి అతి పలుచని రెక్కలను అమర్చారు. ఈ రెక్కలు పీజో ఎలక్ట్రిక్‌ ఆక్యురేటర్లు అనే సూక్ష్మ యంత్రాల సాయంతో సెకనుకు 120 సార్లు కొట్టుకుంటాయి. అయితే ఈ బుల్లి రోబోను ఇంకా అభివృద్ధి చెందించాల్సి ఉంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఈ పనిమీదే ఉన్నారు. ఈ బుల్లి యంత్రపు ఈగ ఏ పని చేస్తుందో... ఏ పనికోసం దీనిని తయారు చేస్తున్నారో... ? ఇదంతా చూస్తుంటే మనకు రాజమౌళి ఈగ సినిమా గుర్తుకొస్తోంది కదూ...!

  • Loading...

More Telugu News